Home రాజకీయం గాంధీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కరోన వైద్యశాలగా మార్పు

గాంధీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కరోన వైద్యశాలగా మార్పు

Gandhi hospital transformed into a full-fledged coronavirus hospital

గాంధీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కరోన వైద్యశాలగ  తయారుచేయాలని మంత్రి ఈటెల రాజేందర్ గారు సంబంధిత అధికారులకు తెలియజేశారు. విదేశాల నుండి వచ్చిన వారిని పూర్తిస్థాయి పర్యవేక్షణలో గాంధీ ఆస్పత్రిలో ఉంచాలని సూచించారు.  సిబ్బందికి సెలవులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు అని ఆదేశించారు. వారికి కావలసిన  పరికరాలను కూడా సమకూర్చుకోవాలి తెలియజేశారు.

మూడో దశకు చేరుకుంటే తీసుకోవాల్సిన చర్యలకు భాగంగా సర్వే లైన్లు పెంచడం ద్వారా దీన్ని అరికట్టవచ్చని అందుకోసం కావాల్సిన టీమ్స్ ని పెంచాలని కూడా సూచించారు. ఆశా వర్కర్ల తో పాటు ఇతర సిబ్బంది కి సెలవులు ఇవ్వకూడదు అని, ఎక్కడివారు అక్కడే ఉండి పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉన్నవారు ఉన్నచోటే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు. వారికి కావలసిన భోజన వసతి సదుపాయాలు కూడా సమకూర్చాలని అదికారులను కోరారు.

మూడో దశకు చేరుకునే అవకాశం ఉందేమో అనే నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. మూడో దశకు చేరుకుంటే రోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దాంతో ఎక్కువ బెడ్స్ అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి  లో అన్ని ఓ.పి ను ఆపరేషన్ ను కూడా రద్దు చేశారు.ఇప్పటికే చేయవలసిన ఆపరేషన్లను ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.

 

Exit mobile version