Thursday, April 15, 2021

Latest Posts

గ్యాంగ్ లీడర్ రివ్యూ..!

నటీనటులు : నాని,కార్తికేయ,ప్రియాంక అరుళ్ మోహన్,లక్ష్మి,శరణ్య,ప్రియదర్శి,వెన్నెల కిషోర్

డైరెక్టర్: విక్రమ్ కుమార్

ప్రొడ్యూసర్స్: Y నవీన్, Y రవి,అండ్ మోహన్ చెరుకూరి

మ్యూజిక్ డైరెక్టర్:అనిరుద్ రవిచందర్

సినిమాటోగ్రఫీ:మీరోస్లా కూబా బ్రోజెక్

ఎడిటర్:నవీన్ నూలి

కథ విషయానికొస్తే :

పెన్సిల్(నాని) ఒక స్టోరీ రైటర్ గా మారాలి అనుకుంటాడు.ఇదే క్రమంలో ఒక బ్యాంకులో దొంగతనం జరుగుతుంది.ఈ దొంగతనాన్ని ఛేదించేందుకు మొత్తం ఐదుగురు ఆడవాళ్లు తమ గ్యాంగ్ కు లీడర్ గా ఉండాలని కోరుతారు.దీనితో నాని వారి గ్యాంగ్ కు ఎలా “గ్యాంగ్ లీడర్” అయ్యాడు.ఈ గ్యాంగ్ అంతా కలిసి అసలు ఆ దొంగతనం ఎందుకు జరిగింది దాని వెనుకున్న రహస్యాన్ని చేధించారా? ఈ కథ అంతటికి మరో ప్రధాన పాత్రదారుడు కార్తికేయ(దేవ్)కు ఉన్న సంబంధం ఏమిటి అన్నది తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

నటీనటులు:

ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడం నానికి అలవాటు. అతడి కామెడీ టైమింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా లక్ష్మి వెన్నెల కిషోర్ కాంబినేషన్లలో వచ్చే సీన్లలో నాని చెలరేగిపోయాడు. అతడి లుక్.. మేనరిజమ్స్ ప్రేక్షకులు ఈజీగా కనెక్టయ్యేలా సాగాయి. హీరోయిన్ ప్రియాంక మోహన్ ఆకట్టుకుంది. ఆమెకు సినిమాలో పెర్ఫామ్ చేసేందుకు పెద్దగా స్కోప్ లేదు కానీ బాగా నటించగలనని చాటింది. కనిపించినంతసేపు ఆహ్లాదం పంచింది. ఆమె హావభావాలు బాగున్నాయి. సీనియర్ నటి లక్ష్మి మరోసారి తన అనుభవాన్ని చూపించింది. సరస్వతి పాత్రలో గొప్పగా నటించింది. ఇటు కామెడీ అటు సెంటిమెంటులో ఆమె అదరగొట్టింది. విలన్ పాత్రలో కార్తికేయ ఆకట్టుకున్నాడు. హీరోగా కంటే విలన్ పాత్రలకు అతను బాగా సూటవుతాడేమో అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే శరణ్యతో పాటు హీరో గ్యాంగులో కనిపించే టీనేజ్ అమ్మాయి చిన్న పాప కూడా బాగా చేశారు. వెన్నెల కిషోర్ కనిపించిన కాసేపు కితకితలు పెట్టేశాడు.

సాంకేతిక నిపుణులు :

‘జెర్సీ’తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు నేచురల్ స్టార్ నాని. దీని తర్వాత విక్రమ్ కుమార్ లాంటి విలక్షణ దర్శకుడితో కలిసి చేసిన సినిమా ‘గ్యాంగ్ లీడర్’ మొదట్నుంచి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రోమోల్ని బట్టి చూస్తే మంచి వినోదం పంచే చిత్రంలా కనిపించిన ‘గ్యాంగ్ లీడర్’.

సినిమా అంతా అయ్యాక ఆలోచిస్తే.. చాలా లోపాలు కనిపిస్తాయి. ఇదేం కథ అవేం మలుపులు అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ సినిమా చూస్తుండగా ఈ లోపాలు కనిపించని విధంగా లాజిక్కుల గురించి ఆలోచించని రీతిలో ఆ సమయానికి ఎంటర్టైన్ అయ్యేలా మ్యాజిక్ చేశారు కొందరు దర్శకులు.

విక్రమ్ కుమార్ ‘నానీ గ్యాంగ్ లీడర్’ను ఇలాగే మలిచాడు.థ్రిల్ చేసే మలుపులు ఉన్నప్పటికీ మరీ సినిమాటిగ్గా – కన్వీనియెంట్ గా సాగిన రైటింగ్ ‘గ్యాంగ్ లీడర్’కు ప్రతికూలత అయింది. ఇందులో పాజిటివ్స్ ఎన్ని ఉన్నాయో నెగెటివ్స్ కూడా అన్నే కనిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్ :

నాని మరియు కార్తికేయల పెర్ఫామెన్స్లు

కథ,కథనం

కథానుసారం వచ్చే ట్విస్టులు

అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ నెమ్మదించిన కథనం

హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ సీన్స్ తగ్గించడం

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss