Tuesday, April 13, 2021

Latest Posts

ఎన్నో దశాబ్దాల తర్వాత తాగే స్టేజ్ కి గంగా నది నీళ్ళు

చాలా ఏళ్ల తర్వాతా గంగా నది నీళ్ళు తాగడానికి పనికొచ్చేలా ఉన్నాయని ఐ‌ఐ‌టి విభాగం పరిశోధనలో తేలింది. చాలా ఏళ్ల క్రితం హిందూ ధర్మం ప్రకారం గంగా నది నీళ్ళు తాగే వారని ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు చెప్తూ ఉండేవారు, కానీ ప్రస్తుత పరిస్తితులులో గంగా నది నీళ్ళు మానవ జీవన అభివృద్ధిలో చిక్కుకుని అపరిశుభ్రానికి, కలుషితానికి గురి అయ్యింది. కాగా హిందూ సనాతన ధర్మం ప్రకారం శవాలను కాశీలో గంగా నది దగ్గర అంత్యక్రియలు చేసి దహన సంస్కారాలు చెయ్యడం వలన అక్కడ నీళ్ళు ఎంతో కలుషితమయ్యాయి.

కానీ ప్రస్తుతం నెలకొన్న లాక్ డౌన్ కారణంగా.. ప్రకృతి మళ్ళీ పూర్వ స్తితికి చేరుకోవడానికి ఊపిరిలూదు తుంది. అంతరించిపోతాయన్న పక్షులు, ప్రాణులు మల్లీ పచ్చగా ఎగురుతున్నాయి. మనకు సూర్యుని కిరణాల నుంచి కాపాడే ఓజోన్ లేయర్ మళ్ళీ పూర్వ స్థాయికి చేరుకుంటుంది. ఇలాగే దేవ ప్రయాగా నుంచి హరిద్వార్ వరకు ప్రవహించే గంగా నది నీళ్ళు మనుషులు తాగడానికి అనువుగా మారాయని, దీనికి కారణం లాక్ డౌన్ వల్ల అక్కడ నీళ్ళను కలుషితం కాకపోవడం అని తేల్చారు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా జరగడం శుభ సూచకం అని భావిస్తునారు.

ఇది కూడా చదవండి: నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss