Ganta Srinivasa Rao Clarity On His Party Change To YCP
టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం చాలా రోజులుగా వినబడుతూనే ఉంది. ఎన్నికలకు ముందు ఆ తర్వాత కూడా ఈ ప్రచారం సాగింది. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఈ సీనియర్ నాయకులు పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు.
అయితే పార్టీ మారుతారంటూ జరుగుతున్న ప్రచారంపై టిడిపి ముఖ్య నేత గంటా శ్రీనివాసరావు తొలిసారి స్పందించారు. పార్టీ మారతానని ప్రతిసారి ప్రచారం జరుగుతుందని తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని ఆయన తెలిపారు. అన్ని అంశాలను కాలమే నిర్ణయిస్తుందని.. తానేంటో రాబోయే రోజుల్లో చెబుతానని గంటా అన్నారు. ఒకవేళ తాను పార్టీ మారాలనుకుంటే.. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాను అని గంటా వ్యాఖ్యానించారు.
టీడీపీలో ఎమ్మెల్యేలు ఇతర పార్టీలలోకి వెళ్లడం అనేది వాళ్ల వ్యక్తిగత విషయం అని గంటా వ్యాఖ్యానించారు. తాను ఒకవేళ పార్టీ మారితే అటువంటి నిర్ణయాలు మార్పులు జరిగితే అందరికీ చెప్పే చేస్తానన్నారు. తనపై జరిగే ఈ తప్పుడు ప్రచారంపై ప్రతిసారి స్పందించలేను అని అన్నారు.
ఇవి కూడా చదవండి: