Monday, July 26, 2021

Latest Posts

తెలుగు సినిమా మహాసముద్రంలో కే‌జి‌ఎఫ్ విలన్

Garuda Ram In Maha Samudram

కెజిఎఫ్ ఫేమ్ గరుడ రామ్, దర్శకుడు అజయ్ భూపతి యొక్క అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మహా సముద్రం తో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఈ మహా సముద్రంలో శర్వానంద్ మరియు సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కన్నడ మరియు తమిళంలో అనేక ప్రాజెక్టులు చేస్తున్న గరుడ రామ్ కి ఇది మొదటి తెలుగు చిత్రం.

తాజాగా ధనుంజయ్ గా గరుడ రామ్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో ఈ నటుడు ఒక రాక్షస రాజులా కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో అతను మెయిన్ విలన్ రోల్ చేస్తున్నట్లుగా మనకి అర్ధమవుతుంది. వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్  హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది మరియు త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss