Tuesday, March 9, 2021

Latest Posts

విశాఖ తరహాలో తెలంగాణలో కూడా గ్యాస్ లీక్

విశాఖ తరహాలో తెలంగాణలో కూడా ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్ ఎస్పీఎం పేపర్ పరిశ్రమలో  ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.  సిఎల్ఓ 2ప్లాంటు వద్ద సుమారు  ఉదయం 6:30 గంటల ప్రాంతంలో  పేపర్ 1, 2 ప్లాంటులకు వెళుతున్న క్లోరిన్ ఒక్కసారిగా లీకు   అవడం జరిగింది దాంతో అక్కడ సమీపంలో విధులు నిర్వహిస్తున్న 20 మంది కార్మికులు  అస్వస్థతకు గురయ్యారు. బాయిలర్‌కు అత్యంత సమీపంలో క్లోరీన్ గ్యాస్ లీకవడంతో ఒక్కసారిగా కార్మికులు పరుగులు తీశారు. ఒక్కరు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హుటహుటిన సమీపంలోని‌ ఓ ప్రైవేటు ఆస్పత్రికి‌ తరలించారు. ప్రస్తుతం ఆ కార్మికుడి పరిస్థితి క్షేమంగానే ఉన్నట్టు సమాచారం. మరో ముగ్గురు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. క్లోరిన్ గాఢత తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తోంది.

లాక్ డౌన్ కావడంతో పూర్తి స్థాయిలో బాయిలర్స్ వినియోగంలో లేకపోవడం పేపర్ బ్రైట్ నెస్ పెంచేందుకు వినియోగించే క్లోరీన్ లిక్విడ్ ఉష్ణోగ్రత 15 డిగ్రీలు మించడంతో ఈ ఘటన జరిగినట్టుగా అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఈ ఘటన పై స్పందించేందుకు సదరు పేపర్ అయిన జేకే పేపర్ మిల్ యాజమాన్యం నిరాకరించింది. పూర్తి వివరాలు బయటకి పొక్కకుండా జేకే పేపర్ మిల్ యాజమాన్యం జాగ్రత్తలు చేపట్టింది.

ఇది కూడా చదవండి: అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి – కే‌టి‌ఆర్

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss