దేశంలో కరోనా కేసుల ఎ మాత్రం తగ్గటం లేదు. దేశంలో ఇప్పటికే 84 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కొన్ని రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్న ఢిల్లీ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కాగా సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు వరకు అందరూ కూడా కరోనా బారిన పడుతున్నారు.
తాజాగా మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతం గంభీర్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. గంభీర్ నివాసంలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో గంబీర్ స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, ఎవరూ కూడా తేలికగా తీసుకోవద్దని గంభీర్ విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: