Home క్రీడలు ఆఫ్రిదికి గట్టి సమాధానం ఇచ్చిన గంభీర్

ఆఫ్రిదికి గట్టి సమాధానం ఇచ్చిన గంభీర్

Gambhir straong reply to Afridi

gautam gambhir strong counter on shahid afridi

గౌతమ్ గంభీర్ పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ నోటి దురుసు మరోసారి బయటపడింది. కాగా గౌతం గంభీర్ బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే, అఫ్రిదీ తన ఆత్మ కథ ను ‘గేమ్ ఛేంజర్‌’ అనే బుక్ ద్వారా పంచుకున్నాడు. ఆ బుక్ లో గౌతం గంభీర్ గురించి స్పందిస్తూ.. గౌతమ్ గంభీర్ కు ఆటగాడిగా ఎలాంటి పరిణితి లేదని, అతడికి ఉన్నదంతా ఒళ్ళంతా పొగరు మాత్రమే అని, క్రికెటర్ గా గంభీర్ కు ఎలాంటి రికార్డులు చెయ్యలేదని , తనకు రికార్డుల కంటే పొగరు చాల ఎక్కువని, మా కరాచీలో ఇటువంటి ఆటగాళ్లను పొగరుబోతులంటామని, గంభీర్ సింగిల్ తీసి నా మీదకు దూసుకొచ్చాడు. అప్పుడు అంపైర్లు వివాదాన్ని ముగించకపోయుంటే.. నేనే ముగించే వాణ్ని అని” ఘాటుగా తన నోటిదురుసును బయట పెట్టాడు.

పాకిస్థాన్ లో జరిగిన 2007 ఆసియా కప్‌లో భారత్, పాక్ తలపడ్డారు. ఇదే ఫైనల్ మ్యాచ్ కావడంతో అందరి దృష్టి ఆ మ్యాచ్ పై ఉండటం జరిగింది. కాగా అదే మ్యాచ్ లో గంభీర్, అఫ్రిదీ కి మధ్య వాగ్వాదాలు చోటుచేస్తుకున్నాయి. కాగా గంభీర్, అఫ్రీది వాగ్వాదాలతో పాటు యుద్ధ వాతావరణాన్ని ఆ మ్యాచ్ లో కల్గించారు. ‘గేమ్ ఛేంజర్’ అనే ఆత్మా కథ బుక్ లో ఆఫ్రిది గంభీర్ పై అప్పటి పరిస్థితి గుర్తు చేస్తూ తన నోటి దురుసును బయటపెట్టాడు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిదీ అఫ్రిదీకి గౌతమ్ గంభీర్ ఘాటైన సమాధానం ఇచ్చాడు. భారత్ ఇప్పటికీ పాకిస్థానీలకు మెడికల్ వీసాలు ఇస్తోందన్న గంభీర్.. నిన్ను నేను వ్యక్తిగతంగా సైక్రియాటిస్ట్ దగ్గరకు తీసుకెళ్తానంటూ తనదైన శైలిలో ఘాటుగా బదులిచ్చాడు.

Exit mobile version