Engagement of Maxwell and Winnie Raman in Indian Tradition:
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, భారత సంతతికి చెందిన ఫార్మాసిస్ట్ విని రామన్ తొ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఐతే ఇటీవలే వీరిద్దరు త్వరలో నిశ్చితార్థం చేసుకుంటామని ప్రకటించటం జరిగింది. ఐతే…శనివారం మెల్బోర్న్లోని తూరక్ ప్రాంతంలో మ్యాక్స్‌వెల్, వినిల నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను విని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది అంతే కాకుండా తమ నిశ్చితార్థం పూర్తిగా భారతీయ సంప్రదాయ పద్దతిలో జరిగిందని “‘గత రాత్రి మ్యాక్స్‌వెల్, నేను భారత సాంప్రదాయంలో నిశ్చితార్థం చేసుకున్నాం. మన వివాహ వేడుక ఎలా ఉంటుందో మ్యాక్స్‌వెల్‌కి చిన్న టీజర్ చూపించా”
అని క్యాప్షన్ ఇచ్చి మరీ విని ఫొటోలను తన ఇన్స్తగ్రామ్ ఖాతా లో షేర్ చేసింది. ఇక విని రామన్ గురించి ఒకసారి చూస్తే… ఈమె మెల్బోర్న్లో స్థిర పడ్డ భారతీయ కుటుంబానికి చెందిన అమ్మాయి. వృత్తి పరంగా ఈమె ఓ ఫార్మాసిస్ట్. తమిళనాడుకు చెందిన ఆమె పూర్వీకులు ఆస్ట్రేలియాలో స్థిరపడినట్లు తెలుస్తోంది. గత రెండేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ జోడీ ప్రేమ వ్యవహారం 2017లో తొలిసారి ప్రపంచానికి తెలిసింది. ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డ్స్-2019 కార్యక్రమానికి కూడా మ్యాక్సీ తన ప్రేయసీ వినితోనే హాజరయ్యాడు. చాలా సార్లు వారి ప్రేమ వ్యవహారాన్ని బయటకు చెప్పారు. ఇక గత కొంతకాలం గా క్రికెట్ కి దూరం గా వున్న మ్యాక్స్‌వెల్ భారత్ లో జరిగే ఐపిఎల్ సీజన్ 13 లో రాణించి అక్టోబర్ 24 న ప్రారంభం కానున్న T20 ప్రపంచ వరల్డ్ కప్ ఆస్ట్రేలియా జట్టులో స్థానం సంపాదించే ప్రయత్నం లో వున్నాడు.