Thursday, March 4, 2021

Latest Posts

మేక, బొప్పాయి కి కరోన పాజిటివ్

Goat Tested positive for corona

కరోన వైర‌స్ ఎటు నుండి ఎటువేల్తుందో ఎవరికి అంతుచిక్కడం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వైర‌స్ మ‌నుషుల‌కు, తర్వాత పులుల‌కు అలా కొన్ని కొన్ని జంతువులకు వ్యాపిస్తూ ఉంది. అలాంటిది ఇప్పుడు మనుషులకే కాకుండాఇంకా చాలా జీవులలో వైరస్ వ్యాప్తి జరుగుతుంది‌. తాజాగా ఒక వింత సంఘ‌ట‌న టాంజానియాలో చోటు చేసుకుంది. అయితే ఇక్క‌డ విచిత్రం ఏంటంటే ఓ మేక‌కు,  బొప్పాయి పండుకు క‌రోనా వైర‌స్ టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది.

విషయానికి వస్తే ప్ర‌పంచ దేశాల‌తో పాటు టాంజానియా దేశంలో క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తోంది. అందువల్ల  వైర‌స్ నిర్ధార‌ణ కోసం టెస్ట్ కిట్ల‌ను ఇత‌ర దేశాల నుంచి దిగుమ‌తి చేసుకున్నారు. వాటి ద్వారా మ‌నుషుల‌తోపాటు బొప్పాయి, మేక, గొర్రెల‌ ‌పైనా అక్కడి వైద్యాధికారులు పరీక్షించగా ఒక షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది. టెస్ట్ చేసిన వాటిలో గొర్రెకు తప్ప మిగ‌తా రెండింటికి వైర‌స్ సోకిన‌ట్లు వైర‌స్ టెస్ట్ కిట్ల చూపించాయి. ఆఫలితాలు చూసిన అదికారులు వైర‌స్ టెస్ట్ కిట్లను పరీక్షించగ  వాటిలో నాణ్య‌తా లోపం కార‌ణంగానే ఇలాంటి త‌ప్పుడు ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని నిర్ధారించారు. అలాగే ఆ దేశ అధ్య‌క్షుడు జాన్ మ‌గుఫులి దిగుమ‌తి చేసుకున్న టెస్టు కిట్ల‌లో సాంకేతిక లోపాలున్నాయ‌ని వెల్ల‌డించారు. అందువల్ల వీటి వాడ‌కాన్ని అక్కడ వైద్యులు నిలిపివేస్తూ ద‌ర్యాప్తుకు ఆదేశించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss