Sunday, June 13, 2021

Latest Posts

రెండు రోజులు తర్వాత భారీగా పెరిగిన పసిడి

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గినా కూడా దేశీ మార్కెట్‌లో మాత్రం పసిడి ధర పరుగులు పెట్టింది. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. మంగళవారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.680 పెరుగుదలతో రూ.51,730కు చేరగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాముల బంగారం రూ.280 పెరిగి రూ.47,090కు చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా భారీగా పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,050 పెరిగి రూ.62,750కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.26 శాతం తగ్గుదలతో 1906 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.44 శాతం తగ్గుదలతో 24.59 డాలర్లకు చేరింది.

 ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss