నిన్న కొద్దిగా తగ్గినట్టు కనిపించిన పసిడి ధరలు ఈరోజు కొద్దిగా పైకెగశాయి. బంగారం ధరలు మంగళవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (07.10.2020) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు నిన్నకాస్త తగ్గుదల కనబరిచిన వెండి ధరలు ఈరోజు భారీగా పెరుగుదల నమోదు చేశాయి. మంగళవారం బంగారం ధర 454 రూపాయలు పెరిగి రూ. 51,879 కు చేరింది. ఇక కిలో వెండి 117 రూపాయలు భారమై 62,058 రూపాయలకు పెరిగింది. అంతకుముందు ట్రేడ్‌లో వెండి ధర కిలో రూ .62,376 నుంచి రూ .751 పెరిగి 63,127 రూపాయలకు చేరుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం వల్లే ఢిల్లీలో 24 క్యారెట్ల స్పాట్ బంగారం ధర 454 రూపాయలు పెరిగింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఔన్స్‌కు 1910 డాలర్లకు తగ్గాయి.
ఇది కూడా చదవండి: