Thursday, February 25, 2021

Latest Posts

పసిడి ప్రియులకు శుభవార్త

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్ రోజు రోజు కు పసిడి ధర తగ్గుతూ వస్తూనే  ఉంది. అలాగే ఇది వరుసగా మూడో రోజు కూడా  బంగారం ధర తగ్గడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర తగ్గిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర తగ్గితే వెండి కూడా ఇదే దారిలో నడిచింది.ఈ రోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గగా  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.120 దిగిరాగా అయితే  దీంతో10 గ్రాముల 22క్యారెట్ల బంగారం  ధర రూ.44,560కు తగ్గింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. 10 గ్రాముల బంగారం ధర రూ.140 క్షీణించింది. దీంతో ధర రూ.48,640కు దిగొచ్చింది. పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.400 దిగొచ్చింది. దీంతో ధర రూ.48,500కు క్షీణిచింది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss