Wednesday, June 23, 2021

Latest Posts

భారీగా తగ్గిన పసిడి ధరలు

లాక్ డౌన్ తర్వాత సామాన్యులకు అందనంత దూరంలో  బంగారం ధరలు పెరిగాయి. బంగారం అంటే మక్కువ చూపే వారు బంగారం ధరలను చూసి భయపడేలా రేట్లు పెరిగిపోయాయి. 10 గ్రాముల బంగారం ధర రికార్డ్ స్థాయిలో రూ.50 వేలు దాటిపోయింది. అయితే, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ తిరిగి క్రమంగా పుంజుకోవడం, కరోనాపై ప్రపంచం చేస్తున్న పోరాటం సత్ఫాలితాలు ఇస్తుండటంతో బంగారం ధరలు క్రమేపి తగ్గుముఖం పట్టాయి.

కాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు ధరలు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 340 తగ్గి రూ.47,250కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 తగ్గి రూ.51,550కి చేరింది. బంగారం ధరలు తగ్గితే, వెండి ధర మాత్రం కాస్త పెరిగింది. మార్కెట్లో కిలో వెండి ధర రూ.800 పెరిగి రూ.67,000కి చేరింది. అయితే..బంగారం రేట్లు హెచ్చుతగ్గులు సాధారణమే అని ఆర్థిక వేత్తలు అంటున్నారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss