Sunday, February 28, 2021

Latest Posts

ఎం‌ఎల్‌ఏ ఇంట్లో బంగారం చోరీ

Gold Theft In TRS MLA House

టి‌ఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో భారీ చోరీ జరిగింది. లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన హైదరాబాద్‌ హైదర్‌గూడలోని ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగింది. ఎమ్మెల్యే బంధువుల ఈ విషయం పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు 305 ఫ్లాట్ ను‌ కేటాయించారు. అయితే ఆ ఫ్లాట్‌లో ఎమ్మెల్యే బంధువు అమర్‌నాథ్ బాబు కుటుంబం కొంతకాలంగా నివసిస్తోంది. శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లాట్‌లో చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ఫ్లాట్‌లోకి వెళ్లిన దొంగలు 14.6 తులాల బంగారం, రూ.10 వేల నగదును ఎత్తుకెళ్లినట్టు సమాచారం.

అయితే పోలీసులు పదుల సంఖ్యలో సెక్యూరిటీ ఉండే క్వార్టర్ట్స్‌లో చోరీ కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమర్‌నాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గతంలో తమ డ్రైవర్ ఇంట్లో పలు వస్తువులు కూడా దొంగతనానికి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss