Friday, June 25, 2021

Latest Posts

మందు బాబులకు శుభవార్త

లాక్ డౌన్  మొదలుయినప్పటి నుంచి   వైన్స్ షాపులు  ఎప్పుడు తెరుస్తారా అని ఎదురు చూస్తున్న మందుబాబులకు శుభవార్త చెప్పింది కేంద్రప్రభుత్వం లాక్‌ డౌన్ కారణంగా ఎక్కడ మందు దొరికే పరిస్థితి లేదు.  గ్రీన్ జోన్ల పరిధిలో ఇక మందుబాబులకు మద్యం దొరకనుంది. గ్రీన్ జోన్‌ల పరిధిలో పాన్ షాపులు, లిక్కర్ షాపులు అమ్మకాలు చేపట్టవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది.

ఏపీలో ఒక్క విజయనగరం జిల్లా మాత్రమే గ్రీన్ జోన్‌లో ఉండగా ఇటు  తెలంగాణాలో నాగర్ కర్నూల్, ములుగు, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్ధిపేట్, మహబూబ్ నగర్, వనపర్తి, వరంగల్ రూరల్, భువనగరి జిల్లాల్ని కరోనా ఫ్రీ జిల్లాలుగా ప్రకటించి ఆ జిల్లాలో మద్యం అమ్మకాలు జరిగే అవకాశం ఉంది.  అయితే షాపుల వద్ద  5 గురి కంటే ఎక్కువ ఉండకూడదు, ఐదుగురు కూడా ఒక్కొక్కరి మధ్య రెండు గజాల దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది .

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss