Monday, July 26, 2021

Latest Posts

ఆర్‌ఆర్‌ఆర్ ప్రేక్షకులకు శుభ వార్త

Good News For RRR Movie Fans

కోవిడ్ -19 యొక్క సెకండ్ వేవ్ క్షీణతను చూపిస్తుండటంతో, ప్రభుత్వం కూడా ఆంక్షలను సడలించింది. దీనితో ఎవరి పనులకు వారు మళ్ళీ తిరిగి వెళుతున్నారు. ఇదే నేపధ్యంలో, టాలీవుడ్ పరిశ్రమ కూడా తదనుగుణంగా ప్రణాళికలు వేస్తోంది. రెండు నెలల గ్యాప్ తరువాత, హీరో నితిన్ తన ‘మాస్ట్రో’ తో తిరిగి సెట్స్ పైకి వెళుతుంది.

అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘రాధే శ్యామ్’, ‘పుష్ప’ తదితర పెద్ద బడ్జెట్ చిత్రాలపై సందేహాలు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించరాట. అన్ని అనుకున్నట్లు సాగితే జూలై ఒకటవ తేదీన షూటింగ్ ప్రారంభమవుతోంది.

ఇప్పటికే రెండుసార్లు సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమాను ఎలా అయినా తొందరగా పూర్తి చేయాలని రాజమౌళి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటివరకు సినిమా షూటింగ్‌ డెబ్బై శాతం పూర్తి అయినట్టు తెలుస్తుంది. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదల తేదీ పై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. రెండుసార్లు ప్రకటించినప్పటికీ, అక్టోబర్ 13న సినిమా విడుదల చేయడం కుదరదని అంతర్గత వర్గాల సమాచారం. కానీ రాజమౌళి షూట్‌ను ముగించిన తర్వాతే విడుదల తేదీ పై పిలుపునివ్వాలని కోరుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss