కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో ఎవ్వరూ బయటకు వెళ్లలేని పరిస్థితి. కొన్ని వ్యవస్థలకు తప్ప మిగిలాన వాటిని పూర్తిగా క్లోజ్ చేశారు. వీటితో పాటు సాఫ్ట్ వెర్ సంస్థలు కూడా మూతపడటంతో వారి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించాయి. అలాగే టెక్ దిగ్గజాలు ఫేస్ బుక్ అండ్ గూగుల్ కూడా లాక్ డౌన్ ముందునుంచే తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే విధంగా చేర్యాలు తీసుకుంది. అలాగే ఇప్పుడు లాక్ డౌన్ ముగుస్తున్నా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కోనసాగించనుంది. 2020 సంవత్సరం చివరి వరకూ ఆఫీసులకు పిలిచే అవకాశం కనిపించట్లేదు.
ఈ మేరకు ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జూకర్బర్గ్ ఈ ఏడాది మొత్తం ఉద్యోగులకు ఇంటినుండే పని కలిపిస్తామన్నారు. కంటెంట్ రివ్యూవర్స్, కౌంటర్ టెర్రరిజం, సూసైడ్, స్వయంగా హాని చేసుకుని ఫేస్ బుక్ లో పోస్టు చేసేవారిపై నిఘా ఉంచేవారు, ఇంజినీర్లు, కాంప్లెక్స్ హార్డ్ వేర్ వారు త్వరలోనే ఆఫీసులకు అటెండ్ అవుతారని చెప్పారు. అలాగే ఇటీవలే జరిగిన సంస్థాగత సమావేశంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇదే తరహాలో స్పందించారు. ఈ ఏడాదిలో మిగిలిన భాగం అంతా ఇంటి నుంచి పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా గూగుల్ మరో నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో ఇంటి నుంచి పనులు చేసుకునేవారికి ఫుడ్, ఫిట్నెస్, హోం ఫర్నీచర్, డెకరేషన్, గిఫ్టుల వంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వమని సీఈఓ సుందర్ పిచాయ్ స్పష్టంగా తెలిపారు.