Monday, October 25, 2021

Latest Posts

డేంజర్ జోన్స్  గా విదేశాల నుంచి వచ్చిన వారి ప్రాంతాలు……..

Govt Announced coronavirus danger zones in india:

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తూ, ఎవరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక మన   దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో గత రెండు నెలలుగా విదేశాల నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన 15 లక్షల మందిని పరీక్షించి క్వారంటైన్ నిఘా పెట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న దృష్ట్యా వివిధ దేశాల నుంచి జనవరి 15 నుంచి మార్చి 23వతేదీ వరకు స్వదేశానికి 15 లక్షల మంది తిరిగివచ్చారని లెక్క తేల్చారు.

ఇలా వచ్చిన   వారందరికీ వైద్యపరీక్షలు జరిపి క్వారంటైన్ నిఘా ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు.విదేశాల నుంచి వచ్చిన వారు 14రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో కొందరి ఆచూకీ లేదని, వారంతా కనీసం 14రోజుల పాటు క్వారంటైన్ లో ఉండేలా చర్యలు చూడాలని కేంద్రం రాష్ట్ర అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

విదేశాల నుంచి 15 లక్షల మంది స్వదేశానికి తిరిగివచ్చారని కేంద్ర హోం మంత్రిత్వశాఖ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ సమాచారం అందించిందని, వీరిపై నిఘా పెట్టాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన 15లక్షల మందిలో కొంతమందికే పరీక్షలు చేశారని కేంద్రం పేర్కొంది. 170 దేశాల్లో కరోనావైరస్ ప్రబలిన నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.  విదేశాల నుంచి వచ్చిన వారు నివాసముంటున్న ప్రాంతాలను డేంజర్ జోన్లుగా ప్రకటించాలని కేంద్రం సూచించింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss