Grand Master Koneru Hampi is on 2nd place of World Chess Rankings:
ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్ లో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్న తెలుగు తేజం కోనేరు హంపి. చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన కోనేరు హంపీ పెళ్లి కారణంగా రెండేళ్లు విరామం తీసుకుంది. తన రీ ఎంట్రీ ద్వారా తన ప్రతిభను తెలియపరచాలని అనుకున్న కోనేరు హంపి, తాను వచ్చిన రెండు నెలల్లో రెండు ఛాంపియన్ షిప్స్ గెలుచుకోవడం గమనార్హం. ఈ ధ్రువతార తన పునరాగమనం ద్వారా తాను ఎప్పటికి అదే ఫేమ్ లో ఉంటానని చెప్పకనే చెప్పింది.
ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్ లో తన స్థానాన్ని మెరుగు పరుచుకున్న తెలుగు గ్రాండ్ మాస్టర్ ఈ మధ్య కైన్స్ లో జరిగిన అత్యంత ప్రతిష్ట్మాకమైన కైన్స్ కప్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచి ప్రపంచ రాపిడ్ ఛాంపియన్ గా నిలిచింది. కాగా ర్యాంకింగ్స్ ప్రకారం తాను రెండో స్థానాన్ని పొందింది. కోనేరు హంపి ఖాతాలో 2586 ఎలో పాయింట్స్ ఉన్నాయి.
హారిక ద్రోణవల్లి 9 వ స్థానంలో కొనసాగుతున్నారు. విశ్వనాథన్ ఆనంద్ 16 వ స్తానంలో ఓపెన్ విభాగంలో, 22 వ స్థానంలో విడిట్ గుజరాతీ కొనసాగుతున్నారు. మొదటి స్థానంలో మాగ్నస్ కార్ల్సన్ మొదటి స్థానంలో ఉన్నారు.