Thursday, December 2, 2021

Latest Posts

ఇస్రోకు ఎదురుదెబ్బ – విఫలమైన రాకెట్ ప్రయోగం

GSLV-F10 fails to launch earth observation satellite

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 10 ప్రయోగం విఫలమైందని ఇస్రో ప్రకటించింది. ప్రయాణించాల్సిన కక్షలో కాకుండా మరో వైపునకు వెళ్ళడం జరిగిందని తెలిపింది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 10 నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుండి ప్రయోగించ బడినది. బుధవారం ఉదయం 3.43 గంటలకు కౌంట్‌డౌన్‌ మొదలు పెట్టగ దాదాపు 26 గంటల తర్వాత గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌10ని శాస్త్రవేత్తలు ప్రయోగించగా రెండు దశల వరకు రాకెట్ విజయవంతంగా అనుకున్న కక్షలో ప్రయాణించింది, మూడో దశలో సాంకేతిక సమస్యల వల్ల అనుకున్న కక్ష లో కాకుండా వేరే దిశకు మళ్ళిందాంతో ప్రయోగం విఫలమైందని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ ప్రకటించారు. ఈ శాటిలైట్‌ గనుక విజయవంత మైతే దేశ రక్షణ, విపత్తుల నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడేది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss