Monday, July 26, 2021

Latest Posts

గుళ్ళు ప్రార్ధనా మందిరాల్లో పాటించవలసిన మార్గ దర్శకాలు

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సడలింపులు ఇచ్చిన నేపధ్యంలో ఈనెల 8 నుంచి పుణ్యక్షేత్రాలు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్, హోటల్స్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నదానిపై కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. 65 ఏళ్లకు పైబడిన వయసువారు, ఇతరత్రా రుగ్మతలు ఉన్నవారు, గర్భిణీలు, 10 ఏళ్లలోపు పిల్లలు ప్రార్థనాలయాలకు ఆలయాలకు వెళ్లకపోవడం మంచిది. భౌతికదూరం తప్పకుండా పాటించాలి. ఫేస్ కవర్స్ లేదా మాస్కులు ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతించాలి. ఆలయ పరిసరప్రాంతాల్లో, చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని ఖచ్చితంగా నిషేధించాలి. భక్తులందరికీ ఆరోగ్యసేతు యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలని, వీలైనంత వరకూ సబ్బుతోగానీ (40 నుంచి 60 సెకన్లపాటు), శానిటైజర్ (కనీసం 20 సెకన్లు) తోగానీ చేతులను అవకాశం ఉన్నపుడల్లా శుభ్రం చేసుకుంటూ ఉండాలి అని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss