Tuesday, April 13, 2021

Latest Posts

ఎమ్మెల్యేకు సోకిన కరోన

Gujarat Congress MLA Imran Khedavala diagnosed with coronavirus

గుజరాత్‌ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలాకు కరోనా సోకినట్లు నిర్ధారణ తో ప్ర‌భుత్వ యంత్రాంగం మొత్తం ఆందోళ‌న‌లో ప‌డింది. సదరు ఎమ్మెల్యే  అహ్మదాబాద్‌లోని జమల్‌పూర్ ఖడియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంగళవారం సుమారు 2గంటల ప్రాంతంలో ఆయన మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి సీఎం విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రదీప్ సింగ్ జడేజాను గాంధీనగర్‌లోని సెక్రటేరియెట్‌లో సమావేశమై, అహ్మదాబాద్‌లో కరోనా వ్యాప్తికి  తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించినట్లు తెలుస్తుంది. మీటింగు అయిన్న్ కొన్ని గంటలకై ఇమ్రాన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో ప్ర‌భుత్వ యంత్రాంగం మొత్తం ఉల్లిక్కి పడింది.

అయితే, కరోన వైర‌స్ పాజిటివ్‌గా తేలిన స‌ద‌రు ఎమ్మెల్యే అంత‌కు ముందే అక్కడి రాష్ట్ర సీఎంతో కూడా భేటీ అయిన‌ట్లుగా అదికారులు తెలుపుతున్నారు.  సీఎం ఆఫీసులోకి వెళ్లడానికి ముందు శరీర ఉష్ణోగ్రతతోపాటు బ్లడ్ రిపోర్ట్ చూస్తారు, కానీ కరోనా సోకిన ఇమ్రాన్ సీఎం ఆఫీసులోకి ఎలా వెళ్లార‌నేది ఇప్పుడు చ‌ర్చానీయాంశంగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్వీపీ హాస్పిటల్‌లో చేరారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న జమల్‌పూర్ ప్రాంతంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా ఆయన తన నియోజకవర్గ ప్రజలకు చేదోడుగా నిలుస్తూ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss