Gujarat police took photos of the batons
కరోనా గురించి అవగాహన కల్పిoచడానికి గుజరాత్ పోలీసులు లాఠీలు పట్టుకోవడం మనేసి చేతిలో కరోనా ఫోటోలు పట్టుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలకు ఎంత చెప్పిన వినకుండా రోడ్లపైకి రావడం, సామాజిక దూరం పాటించక పోవడం చేస్తున్నారు. వారికి ఎంత చేప్పిన వినకపోవడంతో ఈవిధంగా చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన మార్గదర్శకాలను పాటించడం లేదో వారి ఇళ్ల దగ్గరికి వెళ్లి మరియు అవగాహన కల్పిస్తున్నారు. కరోనా మహమ్మారి వివిధ దేశాల్లో సృష్టించిన బీభత్సం గురించి వారి ఫోటోలు చూపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు.
అలాగే మన తెలుగు రాష్ట్రాలలో కూడా కొందరు ప్రజలకు అవగాహన కలిపించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే రుద్రగిరి పోలీసులు కూడా ఒక కళాకారుడికి యమధర్మరాజు వేషమ్ వేయించి రోడ్లమీద తిప్పుతున్నారు. బయటకు వస్తే మీ ప్రాణాలు యమధర్మ రాజు తీసుకువెళ్తాడని ప్రజలకు చెబుతున్నారు.