గుంటూరు అర్బన్ పరిధిలో లాక్డౌన్ విధుల్లో నిర్లక్ష్యం వహించిన 16 మంది పోలీసు సిబ్బందిపై ఎస్పీ రామకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 16 మంది పోలీసు సిబ్బందిని వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ద్విచక్రవాహనదారుల వద్ద వసూళ్లు, పేకాటరాయుళ్లతో కుమ్మక్కు , గుట్కా వ్యాపారులకు సహకరించడం, హోటళ్ల వద్ద మూమాళ్లు తీసుకుంటున్నట్లు తెలియడంతో వారిని క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వీఆర్‌కు పంపుతున్నట్లు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది విధుల్లో అక్రమాలకు పాల్పడటం, అలసత్వం వహించడం అస్సలు సహించబోమని ఈ సందర్బంగా స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: మండపేటలో జరుగుతున్న దోపిడీని అడ్డుకున్న జనసేన