Tuesday, April 13, 2021

Latest Posts

భారత్ యుద్ధ విమానాల రహస్యాలను ISIకి పంపుతున్నఉద్యోగి అరెస్ట్

భారత యుద్ధ విమానాల రహస్యాలను పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఇంటర్‌ సర్వీస్‌ ఇంటలిజెన్స్‌కు(ఐఎస్‌ఐ) చేరవేస్తున్న హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) ఉద్యోగిని అరెస్టు చేసినట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. ఉద్యోగి దీపక్‌ శిర్‌సాత్‌(41) నాసిక్‌లోని హెచ్‌ఏఎల్‌లో అసిస్టెంట్‌ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తూ, కొంత కాలంగా సోషల్ మీడియాలో ఓ మహిళతో తరుచూ చాటింగ్ చేస్తున్నాడు. ఆమె మాయలో పడిపోయి ఐఎస్‌ఐతో నిత్యం సంబంధాలు నెరపుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. అతడిపై నిఘా పెట్టగా నిజమేనని తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. మన దేశ యుద్ధ విమానాల రహస్య సమాచారాలను, ఇతర కీలక విషయాలను కూడా అతడు చేరవేసినట్టుగా తెలిపారు. దీపక్ వద్ద ఉన్న 3 మొబైల్‌ ఫోన్లు, ఐదు సిమ్‌ కార్డులు, రెండు మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎస్ అధికారులు అతన్ని పది రోజుల పాటు విచారించనున్నారు. అయితే ఇప్పటి వరకు అతడు ఏఏ విషయాలను చేరవేశాడో తెలుసుకునేందుకు యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ అధికారులు విచారిస్తున్నారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss