కరోన వైరస్ రోజు రోజుకి విస్తరిస్తున్న తరుణంలో.. ఎప్పుడు పూర్తిగా నయం అవుతుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఉన్న ఈ సమయంలో తమ కుటుంబం వందల సంవత్సరాలుగా ఆస్తమా,దగ్గు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధిత వ్యాధులకు ప్రతి ఏటా మృగశిర కార్తి రోజున వేసే చేప ప్రసాదం ఈ సంవత్సరం వేయడం లేదని బత్తిని హరినాథ్ గౌడ్ ప్రకటించారు.
ఈ మేరకు ఆయన అన్ని ప్రచార సంస్థలకు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. యావత్ ప్రపంచ మానవాళిని గృహ నిర్బంధం చేయిస్తూ అందినవార్ని అంతమొందిస్తున్న మహ్హమ్మారీ కరోనా ప్రభావానికి ఏమందూ లేదు. ప్రతి ఒక్కరూ దూరం పాటించడంతో పాటు, ప్రతి క్షణం పరి శుభ్రత పాటించడమూ, అత్యవసర మైతే తప్ప ఇంటి నుండి బయట కు రాకుండా ఉండటమే రక్షణ అని బత్తిని హరనాథ్ గౌడ్ అన్నారు.
ఏటా దేశ విదేశాలనుంచి వేలాది మంది మా చేప మందుకోసం హైదరాబాద్ వస్తుంటారని.ఈ సంవత్సరం మాత్రం ఎవ్వరు రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఈ నెల 29 తో ముగిసినా తరువాత పరిస్థితులను బట్టి జూన్ లో పొడిగించినా తాము మాత్రం ఈ సారి చేప ప్రసాదం పంపిణీ చేయడం లేదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: సడలింపులతో కష్టాలేనా..?