Tuesday, January 25, 2022

Latest Posts

సిద్ది పేట బెబ్బులి, అపర భగీరథుడు హరీష్ రావు కు జన్మదిన శుభాకాంక్షలు

మామ బొమ్మెస్తే అల్లుడు రంగేస్తారు. మామ దర్శకత్వంలో అల్లుడు పనులు చక్కబెట్టేస్తారు. మామ చెప్పిందే వేదంగా అల్లుడు అల్లుకుపోతారు. అంతలా మామా అల్లుళ్ల మధ్య బంధం పెనవేసుకుంది. వీరిద్దరి బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. మామలోని రాజకీయ లక్షణాలను అంది పుచ్చుకున్న మేనల్లుడు.. మామ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇప్పటికే మీకు అర్ధమయ్యే ఉంటుంది కదా ఆ మామ, అల్లుడు ఎవరు అని మరెవరో కాదండి మామ కేసీఆర్ ఐతే.. అల్లుడేమో హరీశ్ రావు.

తన్నీరు హరీష్ రావు టిఆర్ఎస్ లో కెసిఆర్ తర్వాత అంతటి వాగ్ధాటి కల నాయకుడు.. తెలంగాణ వాదాన్ని వినిపించడంలో గానీ ప్రత్యర్ధులకు సమాధానం చెప్పడంలో దిట్ట.. తెలంగాణలో ప్రజాదరణ పొందిన ప్రజా ప్రతినిధిగా హరీష్ రావు తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్నిక ఎన్నికకు మెజారిటీ పెంచుకుంటూ రికార్డు సృష్టించి ఓటమిని ఎరుగని నేత.. రాష్ట్ర రాజకీయాల్లో చేరిన కొద్ది సంవత్సరాలైనా కాకుండానే మెజారిటీ ఓట్లతో రికార్డులు సృష్టించి రాకెట్లా దూసుకుపోతున్న నేత.. టిఆర్ఎస్ ఆశాకిరణంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాదాన్ని శాసన సభలో బల్ల గుద్ది మరీ చెప్పిన మహా నేత..

1972, జూన్ 3వ తేదీన చింతమడకలో లక్ష్మిబాయి, సత్యనారాయణ రావు దంపతులకు జన్మించారు హరీశ్ రావు. గ్రాడ్యుయేట్ అయిన హరీశ్ రావు తన చదువు పూర్తి కావడంతోనే డైరెక్టుగా రాజకీయాల్లోకి వచ్చారు. ఉద్యమంలో యువ శక్తిని ముందుకు నడిపించడంలో క్రియాశీలకంగా వ్యహరించారు. 2014లో తొలి తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి బంపర్ మెజార్టీ సాధించిన తర్వాత సీఎం కేసీఆర్‌తో కలిపి 12 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో హరీశ్ రావుకు మంత్రి పదవి దక్కలేదు. కొన్ని రాజకీయ సమీకరణాల దృష్ట్యా అదంతా కేసీఆర్ ప్లాన్ అంటారు కొందరు. అందుకే అలా మేనల్లుడిని, కొడుకును పక్కన పెట్టి కేబినెట్ ఏర్పాటు చేశారు. అయితే మంత్రివర్గ విస్తరణలో మాత్రం వారిద్దరికీ మంత్రి పదవులు ఖాయం చేశారు కేసీఆర్.

హ‌రీష్ రావు టీఆర్ఎస్‌లో కీల‌క నాయ‌కుడు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సిద్ధిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న వ‌రుస‌గా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 32 ఏళ్ల వ‌య‌సులో తొలిసారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచిన హ‌రీష్ రావు, అప్ప‌టినుంచి వెనుతిరిగి చూసుకోకుండా తెలంగాణ‌లో బ‌ల‌మైన రాజ‌కీయ నాయ‌కుడిగా ఎదిగారు. కేసీఆర్ మేనల్లుడిగా రాజకీయాల్లోకి వచ్చి… ప్రజాదరణ కలిగిన నేతగా ఎదిగారు హరీశ్‌రావు. తనకు పార్టీ అప్పజెప్పిన ఏ పనిని అయినా విజయవంతంగా పూర్తి చేయడంలో హరీశ్ రావు అందరికంటే ముందుంటారని పార్టీ నేతలు ఇప్పటికీ చెబుతుంటారు.

రాజకీయాల్లో చూసి రమ్మంటే కాల్చి వచ్చే నేర్పరి హరీశ్ రావు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మేనల్లుడైన హరీశ్ రావు… రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి చాలానే శ్రమించారని చెప్పాలి. మామ చాటు అల్లుడిగా రాజకీయ ఓనమాలు నేర్చుకున్న హరీశ్ రావు… కేసీఆర్ చెప్పిన పనిని విజయంవంతంగా పూర్తి చేసే నాయకుడు అనే
స్థాయికి ఎదిగాడు హరీష్ రావు. సూటిగా, పదునుగా మాట్లాడే హరీశ్ రావు ఎక్కడ కాలుపెడితే అక్కడ టీఆర్ఎస్ గెలుపు ఖాయమని పలు సందర్భాల్లో కేసీఆర్ స్వయంగా వ్యాఖ్యానించారంటే… రాజకీయాల్లో హరీశ్ రావు స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.

2004లో కేసీఆర్ రాజీనామా చేసిన సిద్ధిపేట నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచిన హరీశ్ రావు… ఎమ్మెల్యేగా ఎన్నికవడానికి ముందే వైస్ కాబినేట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యేగా సిద్ధిపేటను తెలంగాణలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంతో హరీశ్ రావు శ్రమ ఎంతో గొప్పదనే చెప్పాలి. 2004 నుంచి ఇప్పటివరకు సిద్ధిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రతీ సారీ ఎమ్మెల్యేగా తన మెజార్టీని పెంచుకుంటూ తన రికార్డులు తానే బద్దలుకొట్టుకుంటూ వస్తున్నారంటే… నియోజకవర్గంలో ఆయనకు ఉన్న పాపులారిటీ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఉద్యమ సమయంలో అత్యంక కీలకంగా వ్యవహరించారు. ఉద్యమం వ్యూహాల్లో భాగంగా 2006లో పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేసే సమయంలో హరీష్ రావు అసెంబ్లీ వేదికగా చేసిన ప్రసంగం అందరి మన్ననలు పొందింది.

2009లో కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన సమయంలో కేసీఆర్ అరెస్టు కావడంతో హరీష్ రావు ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మాహుతికి యత్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ మంత్రివర్గంలో భారీ నీటిపారుదల సహా పలు కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించిన హరీశ్ రావు… కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టులు పరుగులు పెట్టిచడంలో కీలక పాత్ర పోషించాడు. కాళేశ్వరం కోసం హరీష రావు తపన గమనించిన రాష్ట్ర గవర్నర్ ఆయన హరీష్ రావు కాదు… కాళేశ్వర్ రావు అని కితాబిచ్చారు.
అంతేకాదు పని రాక్షసుడికి ఉదాహరణ హరీష్ రావు. ఏది ఏమైనా రాజకీయాల్లో హరీష్ రావు అజాతశత్రువు గా ఎదిగాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలానే తన రాజకీయ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా తన రాజకీయ జీవితం కొనసాగాలని ఆశిస్తూ ఆయనకు మన 99 చానెల్ తరుపు నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss