Harish Shankar shocking comments on Gandhi Hospital incident
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణకు లాక్ డౌన్ పాటిస్తున్న సమయంలో ఈ మాయరోగం కూడా కంట్రోల్ అవుతోందని అనుకుంటున్న సమయంలో పిడుగుపాటులా నిజాముద్దీన్ ఘటనతో ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కి పడింది. తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా కరోనా సంఖ్యపెరిగిపోవడం అందరిని కలవరపరిచింది. ఇక హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి అయితే కరోనా హాస్పిటల్ గా మారిపోయింది. నిజానికి పేదలకు ఏ జబ్బు వచ్చినా అక్కడికే క్యూ కడతారు. అలా నిత్యం సాధారణ రోగులతో నిండిపోయే గాంధీ కరోనా చికిత్స కేంద్రంగా మారిపోయింది.
సాధారణ ఓపీ, ఐపీ ఆపేసి,కేవలం కరోనా పాజిటివ్స్కు చికిత్సల లో మునిగిపోయి, ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు ఇక్కడి వైద్యులు,సిబ్బంది శ్రమిస్తున్నారు. గాంధీ హాస్పిటల్లో వైద్యులు, ఇతర సిబ్బంది ప్రాణాలకు తెగించి కరోనా వైరస్ సోకిన పెషేంట్స్కు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఓ కరోనా పెషేంట్ బంధువులు డాక్టర్, అక్కడున్న సిబ్బందిపై దాడి చేయడంతో అందరూ నిర్ఘాంతపోయారు.
దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. డాక్టర్స్పై దాడి జరగడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. తాజాగా డైరెక్టర్ హరీశ్ శంకర్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు డాక్టర్స్, సంబంధిత సిబ్బందిపై జరిగిన దాడిని ఖండించారు. ‘‘డాక్టర్లు, నర్సులు., పోలీస్లు పౌరులు, మానవులు కాదా..!!? నిన్న జరిగిన సంఘటనలపై పౌరహక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు పత్తా లేరు…!! సజ్జనార్ సార్ను కడిగేయడానికి మాత్రం తోసుకుంటూ ముందుకొస్తారు’’ అంటూ తనదైన శైలిలో మానవ సంఘాలను ప్రశ్నిస్తూ హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు.