Harish Shankar Shocking Comments on Jr. NTR Son:
సెలబ్రిటీల పిల్లలంటే అలాగే ఉంటుంది మరి. అందుకే సినీ స్టార్స్ పిల్లలు సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ కూతురు సితార అయితే సోషల్ మీడియాలో ఇరగదీస్తోంది. ఇక హోలీ సందర్బంగా హోలీ ఆడిన అనంతరం యంగ్ టైగర్ ఎన్టీయార్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫ్యామిలీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అభిమానులకు, తెలుగు సినీ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు చెబుతూ భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో కలిసి ఉన్న ఫొటోను ఎన్టీయార్ షేర్ చేశాడు. ఈ ఫొటోను ఎన్టీయార్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేయాంతో కామెంట్స్ కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతూన్నాయి. ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన లభించింది.
మామూలు జనాలే కాదు,సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ ఫొటోపై స్పందిస్తూ, ఎన్టీయార్ చిన్న కొడుకు భార్గవ రామ్ గురించి కామెంట్ చేశాడు. `ఎన్టీయార్ చిన్న కొడుకు కెమేరా వైపు చూస్తున్న విధానం ఏమి చెబుతోందంటే.. వదిలితే ఇప్పుడే దూకేసేలా ఉన్నాడు. లిటిల్ టైగర్.. వస్తున్నాడు` అంటూ హరీష్ శంకర్ చేసిన ట్వీట్ ఫాన్స్ లో కాకపుట్టుస్తోంది.