Friday, June 25, 2021

Latest Posts

జులై 31వరకూ.. హర్యానా సర్కార్ కీలక నిర్ణయం

Haryana Government has been extended lockdown till july 31

దేశంలో కరోనా వైరస్ తన దాడిని కొనసాగిస్తున్న నేపథ్యంలో కట్టడికోసం ఆయా రాష్ట్రాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో 7వ తేదీ వరకూ లాక్ డౌన్ పొడిగించగా, ఉత్తరప్రదేశ్ లో జూన్ 30వరకూ కొన్ని ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించింది. ఇక హర్యానా సర్కారు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జులై నెలాఖరు వరకు ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేలా చూడాలని గురుగ్రామ్ నగరానికి చెందిన పలు బహుళజాతి ఐటీ కంపెనీలను అక్కడి ప్రభుత్వం ఆదేశించింది.

గురుగ్రామ్ నగరంలోని ఎంఎన్‌సీలు, బీపీఓలు, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ సంస్థలు జులై 31వతేదీ వరకు వర్క్ ఫ్రం హోం చేసేందుకు అనుమతించాలని తాము కోరినట్లు గురుగ్రామ్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ సీఈవో వీఎస్ కుందూ చెప్పారు. డీఎల్ఎఫ్ సహా పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్మాణపనులు ప్రారంభించేందుకు తాము గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని హర్యానా అదనపు ప్రధాన కార్యదర్శి కుందూ వెల్లడించారు. అయితే కరోనా వైరస్ ప్రబలకుండా కార్మికులు, ఉద్యోగులు సామాజిక దూరం పాటించాలని, మాస్క్ లు ధరించాలని, శానిటైజర్లు వాడాలని సూచించారు.

దేశ రాజధాని నగర సమీపంలోని నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో భాగమైన గురుగ్రామ్ ను మిలీనియం సిటీగా పిలుస్తారు. ఈ మిలీనియం సిటీలో ఇన్ఫోసిస్, జెన్‌పాక్ట్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా అనేక బీపీఓలు,ఎంఎన్‌సి కంపెనీలు టెక్నాలజీ దిగ్గజ కంపెనీలున్నాయి. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో మార్చి నెలలోనే కంపెనీల ఉద్యోగులు ఇళ్ల వద్ద నుంచి పనిచేసేలా అనుమతించాలని గురుగ్రామ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss