ఎన్‌టిఆర్‌తో త్రివిక్రమ్ చిత్రం గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ రోజు ఈ స్టార్ దర్శకుడు మరియు నందమూరి హీరో అన్నపూర్ణ స్టూడియోలో సెట్లలో ప్రత్యక్షమయ్యారు. అయితే మీరు ఇది చదవగానే వెంటనే వీరి సినిమా మొదలయ్యింది అనే అభిప్రాయం కలగొచ్చు. కానీ దీనికి చిత్రానికి ఏం సంబందం లేదట. దీనికి కారణం వీరు టీవీ కమర్షియల్ షూట్ కోసం వెళ్లారట.
ఈ మే నుండి ప్రసారం కానున్న “మీలో ఎవరు కోటీశ్వరుడు” యొక్క తరువాతి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్నట్టు సమాచారం. దీని కోసం వీరు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ షో యొక్క నిర్మాతలు త్రివిక్రమ్ ప్రోమోను తీస్తే బాగుంటందని అతనితో చేస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద వీరిద్దరూ ఈ టివి ప్రోమో కోసం అన్నపూర్ణకు వెళ్లారన్న మాట. అరవింద సమేతా తో కలిసి హిట్ కొట్టిన వీరిద్దరు మళ్ళీ ఎప్పుడు సినిమా చేస్తారో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి: