HC Issues Notice To 5 YSRCP MLAS
లాక్ డౌన్ నిబందనలను ఉల్లంగిచారన్న పిటిషన్ పై ఈ రోజు ఏ.పీ హై కోర్ట్ విచారణ చెప్పటింది. పిటిషన్లో పేర్కొన్న ఐదు గురు ఎంఎల్ఏ లకు హైకోర్ట్ నోటీసులు జారీచేసింది. వై.సీ.పీ ఎంఎల్ఏలు ఐన మధుసూదన్ రెడ్డి, రోజా, సంజీవయ్య, వెంకట్ గౌడ్, రజనీ లకు నోటీసులు జారీచేసింది. లాక్ డౌన్ నిబందనలను ఉల్లంగించారు అన్న పిటిషన్ పై వారిని వివరణ కోరిన హైకోర్ట్. అలాగే నిబందనలను అతిక్రమించిన ఐదుగురు ఎంఎల్ఏ ల పై తీసుకున్నా చర్యాలు గురించి వారం రోజులలో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీ.జీ.పీని ఆదేశించింది .
కరోనా వ్యాప్తి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విదించింది. అలాగే అతి ముఖ్య మైన కొన్ని నిబందనలను కూడా తెలిపింది. లాక్ డౌన్ సమయంలో ఎక్కువ మంది గుమికూడ వద్దని, సభలు సమావేశాలు పెట్టవద్దని, ప్రభుత్వ కార్య కలపాలు సాగించే టప్పుడు సామాజిక దూరం పాటించాలని తెలిపింది. కానీ కొంత మంది ఎంఎల్ఏ లు అతుత్సాహానికి పోయి, పబ్లిసిటీ మోజులో వాటిని అతిక్రమించారు.