Thursday, February 25, 2021

Latest Posts

తెలుగు రాష్ట్రాలకు నేడు, రేపు భారీ వర్షా సూచనా

తెలుగు రాష్ట్రాలలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. శుక్ర, శని వారాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. అందుకు కారణం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనమనే చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న కారణంగా రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనానికి తోడుగా, శ్రీలంక తీరానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలోని గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్ ప్రాంతంలో 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు మరో ఆవర్తనం వ్యాపించి వుందని తెలిపారు. దీని ప్రభావం తమిళనాడు, కేరళ, కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాలపై ఉంటుందని, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం శ్రీలంక తీరానికి దగ్గరలో నైరుతి బంగాఖాతంలోని గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్, దాని దగ్గరలో ఉన్న శ్రీలంక ప్రాంతాల్లో 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు.

ఇది కూడా చదవండి:  

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss