Hebba Patel is ready for the web series
కెరీర్లో స్థిరపడేందుకు గాను గ్లామర్ డోస్ పెంచేందుకు సై అంటుంది హెబ్బ. అందాల ఆరబోతలో కొందరు హీరోయిన్స్ హవా చూపిస్తుంటారు. అలాంటి హీరోయిన్స్‌లో ఒకరే బోల్డ్ బ్యూటీ హెబ్బాపటేల్. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన ఈ భామకు తెలుగులో ‘కుమారి 21 ఎఫ్’ మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే అవకాశాలు అందిపుచ్చుకోవడంలో మాత్రం ఈ సినిమా అంతగా ప్రభావితం చేయలేకపోయింది.
ఇటీవలే విడుదలైన ‘24 కిస్సెస్’ మూవీలో చేసిన కొన్ని బోల్డ్ సీన్స్‌లో తనదైన హావభావాలతో ఆకట్టుకుంది. అయిన లాభం లేకపోవటం తో స్టన్నింగ్ లుక్ లోకి మారి ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా రెడీ అవగా… ఆమె రామ్ హీరోగా రూపొందుతున్న RED సినిమాలో హాట్ ఐటెం సాంగ్ చేసింది. ఈ పాటలో అమ్మడి గ్లామర్ డోస్ తో థియేటర్స్ లోని ఆడియన్స్ కి మంచి ఊపు ఇవ్వటం ఖాయం గా అనిపిస్తుంది.ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం పట్టలేకపోయింది ఈ అమ్మడు.. ఇక లాభం లేదని ఈ మోడ్రన్ యుగంలో ఆన్లైన్ వేదికలను అస్త్రంగా వాడుకోవాలని ఫిక్స్ అయిందో ఏమో గానీ పలు వెబ్ సిరీసుల్లో రెచ్చిపోయేందుకు రెడీ అంటుంది హెబ్బాపటేల్. ఇకపై ఓటీటీ వేదికగా తన గ్లామర్ అందాలను అరబోయటానికి స్కెచ్ వేస్తున్నట్లు వినికిడి.
ఇప్పటికే ఆహా యాప్ లోని మస్తీస్ అనే వెబ్ సిరీస్‌లో నటించిన హెబ్బ.. తాజాగా మరో రెండు వెబ్ సిరీస్‌లు చేసేందుకు రెడీ అయిందట. నెట్ ఫ్లిక్స్ సంస్థ తీయబోయే ఆ రెండు వెబ్ సిరీస్‌లు అడల్ట్ కంటెంట్‌తో కూడి ఉంటాయని సమాచారం. ఇందులో కుమారి అందాల ఆరోబోతకు హద్దే ఉండదని, ఆ మేరకు హెబ్బా కూడా రెడీ అయిందని టాక్ వినిపిస్తుంది. ఈ ప్రయత్నమైన హెబ్బా ను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో వేచి చూడాలి.