Monday, May 10, 2021

Latest Posts

మార్స్ పై ఎగిరిన హెలికాప్టర్ చరిత్ర సృష్టించిన నాసా

Helicopter Flies On Mars
మార్స్ పై ఇల్లులు కట్టడానికి ప్లాన్స్ చేస్తున్నారు ఇక మనిషి అక్కడ కాలుమోపడమే ఆలస్యం. మరి అది అంత సులువేనా మార్స్ నుంచి పంపిన నాసా రోవర్ పర్సెవరెన్స్ ఇప్పటి వరకు పంపిన డేటా ఏం చెబుతోంది. అసలు అంగారకుడి పై ఇల్లను నిర్మించడం సాధ్యమేనా. దీనంతటినీ తెలుసుకోవడం కోసం అమెరికాకు చెందిన నాసా మార్స్ రోవర్ పర్సెవరెన్స్ ను వదిలింది.

అబిబో లాంటి కంపెనీలు మార్స్ పై కాలనీలు నిర్మించాలంటే పర్సెవరెన్స్ లాంటి రోవర్ లు పంపే డేటా చాలా కీలకం. అంగారకుడిపై మానవాళి జీవించగలరా అసలు అక్కడ ఇంతకు ముందే జీవం ఉనికి ఉందా ఉంటే అవి ఎలా మనుగడ కొనసాగిస్తున్నాయి అన్న కోణంలో శాస్త్రవేత్తలు ప్రస్తుతం పరిశోధనలు జరుపుతున్నారు.

రోవర్ను దిగ్విజయంగా దింపడమే చాలా గొప్ప విషయం అనుకుంటే ఈ ప్రయోగంలో మరో మైలురాయిని చేరుకుంది నాసా. మార్స్  పై హెలికాప్టర్ ను చక్కర్లు కొట్టించి అద్భుతం సృష్టించింది.  భూమిపై తప్ప మరే గ్రహంపైనా ఎగరని హెలికాప్టర్ ను మార్స్ లో తిప్పింది నాసా. దీనికి సంబంధించిన ఫోటో విడుదల చేసింది. మార్స్ పై హెలికాప్టర్లు విమానాలు ఎగిరేందుకు ఎలాంటి అవకాశం ఉందొ తెలుసుకోవడం కోసం ఈ ప్రయోగం చేపట్టింది నాసా. 19న తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అక్కడ హెలికాప్టర్ ఎగిరింది.

ఇక ఈ హెలికాప్టర్ లో నావిగేషన్ వ్యవస్థతో పాటు.. అత్యాధునిక కెమెరాలు ఉన్నాయి. ఇది పంపే డేటాను కూడా విశ్లేషిస్తే.. మార్స్ పై జీవనం గురించి మరింత అర్థం చేసుకోవచ్చనేది సైంటిస్టులు చెప్తున్నారు. దీనితో ఏం చేస్తారు అంటే .. పురాతన సూక్ష్మజీవుల ఉనికి పై విశ్లేషణ చేస్తారు. అక్కడ జీవజాలం ఉందా లేదా ఉంటే ఎలా ఉంది..ఎంత కాలం కిందట ఉందనే అంశాల పై పరిశోధనలు చేస్తారు.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss