బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ అంటే తెలుగు ఇండస్ట్రి లో ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సింహా సినిమాతో బాలకృష్ణ స్టామినాను మళ్ళీ తెలిసేలా చేశాడు బోయపాటి. బోయపాటి శైలి మాస్ కావడం బాలకృష్ణ కూడా మాస్ హీరో కావడంతో వీరి కాంబినేషన్ కూడా కేక పుట్టే మాస్ సినిమా నే అయ్యి ఉంటుంది. వీరి కాంబినేషన్ లో మొదట వచ్చిన సింహాతో డియటర్ లు దద్దరిల్లగా, ఆ తరువాత వచ్చిన లెజెండ్ సినిమా అంటే ఊర మాస్ కలెక్షన్స్ రాబట్టింది.
కాగా ఈ సినిమాలో ప్రతినాయకుని పాత్రలో నటించి అలరించిన జగపతి బాబు ఆ ఒక్క సినిమా తర్వాతా సౌత్ ఇండియా మొత్తం మీద బిజీ యాక్టర్ అయిపోయాడు. కాగా బోయపాటి, బాలకృష్ణ రోబోయే సినిమాలో కూడా ప్రతి నాయకుని పాత్రకు తెలుగు హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. మొదట్లో ఫ్యామిలి హీరో శ్రీకాంత్ విలన్ గా చెయ్యనున్నారని వారటలొచ్చినా, ఇప్పుడు హనుమాన్ జంక్షన్ లో నవ్వులు పూయించిన వేణు ఈ సినిమాలో చెయ్యబోతున్నాటు వార్తలొస్తున్నాయి. అయితే వేణు ఇంతకముందు బోయపాటి తీసిన దమ్ము సినిమాలో ఎన్టిఆర్ కు బావగా నటించాడు.
ఇది కూడా చదవండి: ఓటిటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కానున్న కీర్తి సురేష్ “పెంగ్విన్”