Thursday, May 13, 2021

Latest Posts

విలన్ పాత్రలకు సై అంటున్న గోపీచంద్

Hero gopichand accepted villain roles:

విలన్లుగా రాణించి హీరోలైన వాళ్ళు,హీరోలుగా రాణించి విలన్లుగా క్లిక్ అయినవాళ్లు టాలీవుడ్ లో ఉన్నారు. ఫామిలీ హీరో గా ముద్రపడిన జగపతి బాబు విలన్ అవతారం ఎత్తి, బానే క్లిక్కయ్యాడు. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా నటిస్తూనే.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణించాడు. తెలుగు-తమిళ పరిశ్రమల్లో జగ్గూ భాయ్ హవా బాగానే నడిచినా ఇటీవల హవా తగ్గినట్లు కనిపిస్తోంది. జగపతి తరహాలోనే యాంగ్రీ హీరో రాజశేఖర్ విలన్ గా మారతాడని ప్రచారమైంది. కానీ ఇంకా హీరోగానే సినిమాలు చేస్తున్నాడు.

Hero-Gopichand

ఇక ఇటీవల వరుస ఫ్లాపులతో గోపిచంద్ కెరీర్ డైలమాలో పడింది. దీంతో విలన్ గా చేయాలన్న ఆలోచనలో పడ్డాడట. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో విలన్ గా నటించేందుకు గోపిచంద్ అంగీకరించినట్లు టాక్. ఇక ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నందుకు అతడు హీరోగా అందుకునే పారితోషికాన్ని మించి ఛార్జ్ చేస్తున్నాడట. ఇప్పటికే జగపతిబాబు కూడా బాలకృష్ణ- రజనీకాంత్ లాంటి హీరోలకు విలన్ గా నటించి మెప్పించాడు. ఇప్పుడు గోపిచంద్ అదే బాటలో వెళ్ళాలన్న నిర్ణయానికి వచ్చాడట.

నిజానికి గోపీచంద్ కి విలనీ కొత్తేమీ కాదు. ఇంతకుముందు ప్రభాస్ `వర్షం`లో అదిరిపోయే విలనిజం పండించాడు. పిలకముడితో మొరటోడిగా ఇరగదీశాడు. నితిన్ జయం లోనూ విలన్ గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత మహేష్ – తేజ కాంబినేషన్ మూవీ `నిజం`లోనూ విలన్ గా ఇరగదీశాడు. మళ్లీ ఇప్పుడు రజనీకాంత్ సినిమాతో విలన్ అవతారం ఎత్తుతున్నాడు. ఇకపోతే కన్నడ హీరో కిచ్చా తరహాలోనే ఇరుగు పొరుగు పరిశ్రమల్లో విలన్ గా కనిపించబోతున్నాడా? లేక ఇక్కడ కూడా చేస్తాడా అనేది ఇంకా తేలాల్సి ఉంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss