Sunday, June 20, 2021

Latest Posts

గొప్ప మనసును చాటుకున్న హీరో నిఖిల్

Hero Nikhil Help His Fan

కరోనా సెకండ్‌ వేవ్‌ భారత్‌ను వణికిస్తోంది. ఎటు చూసినా కరోనా అనేలా జనాలను భయ బ్రాంతులకు గురిచేస్తుంది. సవాలక్ష జాగ్రత్తలు తీసుకున్నవారు కూడా ఎక్కడో జరిగిన చిన్న పొరపాటు వల్ల ఈ మాయదారి రోగం బారిన పడుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతుందీ కరోనా. తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని ఉధృతి విపరీతంగా ఉంది.

దేశంలో రోజుకు లక్షకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. దీనితో ప్రజలు దీనిని నిర్మూలించే రెమిడిసివిర్ ఇంజెక్షన్ కోసం పరుగులు పెడుతున్నారు. దీనితో దేశంలో ఇంజెక్షన్‌ల కొరత కూడా అధికంగానే ఉంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతున్న తన తండ్రికి రెమిడిసివిర్‌ ఇప్పించాలంటూ హీరో నిఖిల్‌ను ట్విటర్‌లో సంప్రదించాడు. దయచేసి తమకు సాయం చేయాలని కోరాడు. దీనిపై పెద్ద మనసుతో స్పందించిన హీరో.. ‘సిరివూరి రాజేశ్‌ వర్మ మీకు అవసరమయ్యేన్ని రెమిడిసివిర్‌ డోసులతో మిమ్మల్ని సంప్రదిస్తాడు. మీ నాన్నగారికి త్వరలోనే నయమవుతుంది’ అని భరోసా కల్పించాడు. దీనితో ఇప్పుడు నిఖిల్ చేసిన సాయం సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా మారింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss