Sunday, June 20, 2021

Latest Posts

త్వరలోనే పెళ్లి చేసుకొనున్న యంగ్ హీరో

Hero Raj Tarun To Marry Soon

రాజ్ తరుణ్ చాలా కాలం తరువాత, ‘ఓరే బుజ్జిగా’ అనే కామెడీ సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. అయితే కరోనా కారణంగా ఈ హీరో నటించిన కొన్ని సినిమాలు ఓటిటిలో వచ్చి ప్రేక్షకులను అలరించాయి. ఇక పోతే ఈ సంవత్సరం, అతను ఇంకా కొత్త సినిమా విడుదలలను ప్లాన్ చేయలేదు. ప్రస్తుతం, ఈ యువ నటుడు ‘స్టాండ్ అప్ రాహుల్’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

తాజా వార్తల ప్రకారం ఈ హీరో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ నటుడు ఇటీవల హైదరాబాద్‌లో కొత్త ఇల్లు కొని తన తల్లిదండ్రులతో కలిసి అక్కడికి షిఫ్ట్ అయ్యాడు. దీంతో అతను తన వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నాడని టాలీవుడ్ కోడై కూస్తుంది. రాజ్ తరుణ్ ఇంతకుముందు ఇద్దరు హీరోయిన్లతో డేటింగ్ చేసినట్టు పుకార్లు కూడా వచ్చాయి. అయితే ఈ యువ హీరో త్వరలోనే ఓ ఇంటివాడయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss