Monday, May 10, 2021

Latest Posts

కరోనా వేళ .. సేవల్లో తరిస్తున్న  సెలబ్రిటీలు

Hero Srikanth distributes food to poor people during coronavirus crisis

కరోనా సమయంలో ప్రజలను చైతన్య పరచడంలో గానీ, అన్నార్తులను ఆడుకోవడంలో గానీ సినీ సెలబ్రిటీల సేవలను వెలకట్టలేం. ఒకరికొకరు పోటీ పడుతూ తమ సేవా భావాన్ని చాటుతున్నారు.
* హీరో శ్రీకాంత్ ఆధ్వర్యంలో హైదరాబాద్ యూసఫ్ గూడలోని కృష్ణకాంత్ పార్కు దగ్గర ఐదు వందల మందికి బుధవారం మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు.  పోలీస్ బందోబస్త్ మధ్య ఈ కార్యక్రమం చేసారు. అలాగే రాయదుర్గం పోలీసుల ఆధ్వర్యంలో రోజూ వారి కార్మికులకు శానిటైజర్స్, ఆహార సామాగ్రిని శ్రీకాంత్ పంపిణీ చేశారు.

*కరోనా లాక్డౌన్ నేపథ్యంలో సంపాదన కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసం ద్వారా ఒక్కరోజే  వెయ్యి మంది సినీకార్మికులకు నిత్యావసరాలు అందించారు. దీంతో ఈ టీమ్పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఇక అమితాబ్ బచ్చన్గారు ఈ పంపిణీ విధానం తెలుసుకొని నాకు ఫోన్ చేసి మరీ అభినందించారు.

* ఈ టైమ్ లో  మనం రైతుకి అండగా ఉండకపోతే, గతంలో రైతు ఉండేవాడు అని పుస్తకాల్లో చదువుకోవాల్సి వస్తుందేమో అని భయమేస్తుంది. అరటి, బత్తాయి, దానిమ్మ, నిమ్మ, మామిడి, జామ.. ఇవి తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీటిని కొందాం.. ఆరోగ్యాన్ని పెంచుకుందాం. రైతును కాపాడుకుందాం. దేశాన్ని కాపాడుకుందాం..’’ అని నటి హేమ ఓ  వీడియో ద్వారా వివరించింది.

*”మన సిఎం కేసీఆర్సార్ చాలా క్లియర్గా బయటకు రావొద్దు అని చెప్పారు. వాళ్లు చెప్పాక కూడా బయట తిరిగే వాళ్ళకు మీ పద్దతిలోనే సమాధానం చెప్పాలి. నేను వచ్చి చెబితే మంచి జరుగుతుంది అని మీరు నమ్మితే తప్పకుండా వస్తాను’’అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు.  పోలీస్ చెక్ పోస్ట్ల దగ్గరకు వచ్చి ప్రజలను బయటకు రావద్దని కోరాల ని ఓ పోలీస్ అధికారి అడగడంతో పైవిధంగా స్పందించాడు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss