Hero Sunil Charges Shocking Remuneration:
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన సునీల్ ఇప్పుడు విలన్ గా కూడా చేసేస్తున్నాడు. ఏదోలా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్న ఉద్దేశ్యం సునీల్ కి బలంగా ఉంది. టాలీవుడ్ లోని యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరి సినిమాల్లో తన కామెడీతో నవ్వులు పండించిన సునీల్ కమెడియన్ గా తన కెరీర్ పీక్ టైంలో ఉన్నపుడు హీరోగా తన లక్ ను టెస్ట్ చేసుకున్నాడు. `అందాల రాముడు`తో అరంగేట్రం చేసి, `మర్యాద రామన్న`తో మంచి గుర్తింపు పొందాడు. దీంతో ఫుల్ టైం హీరోగా మారిపోదామని డిసైడ్ అయ్యాడు.
కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచిందన్నట్లు ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోగా నటించిన సునీల్, హిట్ లు సాధించలేదు. దీంతో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చేసి, పాత ట్రాక్ లో పడ్డాడు. ఇక కమెడియన్ గా సునీల్ నిలదొక్కుకుంటాడను కునేలోగా, `డిస్కో రాజా`లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి షాకిచ్చాడు. అయితే హీరో నుంచి విలన్ కు ఛేంజ్ అయిన సునీల్ రెమ్యునరేషన్ కూడా ఛేంజ్ అయింది.
హీరోగా రెండు కోట్లు తీసుకున్న సునీల్ ఇపుడు ఒక రోజు ఫుల్ కాల్షీట్ కు రెండు లక్షలు చార్జ్ చేస్తున్నాడట.ఓడలు బండ్లవడమంటే ఇదే సునీల్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే డిస్కోరాజా సినిమాలో విలన్ పాత్రలో నటించిన సునీల్ కు మంచి పేరు రావడంతో విలన్ గా కూడా వేయాలని భావిస్తున్నాడట.ఇకపై కమెడియన్ – విలన్ – సపోర్టింగ్ యాక్టర్ ఇలా ఏదైనా చేసి,ఇండస్ట్రీలో ఉండాలని సునీల్ నిర్ణయం తీసుకున్నాడట. ప్రస్తుతం సునీల్ ‘కలర్ ఫొటో’ సినిమాలో ఎస్సై రామరాజు అనే విలన్ పాత్రలో నటిస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ జాగర్లమూడి కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో సునీల్ ఓ కీ రోల్ ప్లే చేస్తున్నాడట. పవన్ తో పాటు ఎక్కువసేపుండే పాత్రను సునీల్ కోసం క్రిష్ క్రియేట్ చేశాడట. విలన్ కమ్ కమెడియన్ కమ్ సపోర్టింగ్ యాక్టర్ గా సునీల్ సక్సెస్ కొడతాడా, చతికిలబడతాడా అనేది చూడాలి.