Monday, July 26, 2021

Latest Posts

తేజా సజ్జ తదుపరి చిత్రంకు భారీ పారితోషకం

Hero Teja Sajja Remuneration

చిన్న హీరోల వేతనం వారి మునుపటి సినిమా నటనపై ఆధారపడి ఉంటుంది. స్టార్ హీరోలకు ఇది వర్తించకపోయినా, నిర్మాతలు వారి వేతనం చివరి చిత్రం యొక్క బాక్స్ ఆఫీస్ స్థితిని బట్టి ఇస్తూ ఉంటారు. తాజాగా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరో గా మారిన తేజా సజ్జ వేతనం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది. తేజ కి కోటి రూపాయిల పారితోషకం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

జాంబీ రెడ్డి విజయాన్ని ఆస్వాదిస్తున్న ఈ నతుడు ఇష్క్ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రశాంత్ వర్మతో కలిసి తన తదుపరి సినిమాకు ఈ భారీ మొత్తాన్ని అందుకోనున్నాడు. తేజకు మంచి మార్కెట్ విలువ ఉంది మరియు అతని సినిమాల సాటిలైట్ మరియు ఓటిటీ హక్కులకు మంచి డిమాండ్ ఉంది. ఈ విధంగా, కోటి రూపాయిల వేతనం అతనికివ్వడానికి చిత్ర నిర్మాతలు వెనుకాడటం లేదని తెలుస్తుంది.

తేజ తన తదుపరి చిత్రంలో హనుమాన్ పాత్రలో కనిపించనున్నాడు. తేజా పూర్తిగా కొత్త అవతారంలో కనిపిస్తాడు మరియు ఈ చిత్రం ప్రారంభించినప్పుడు అతను తన క్రొత్త గెటప్ లో అందరిచే ప్రశంసలు అందుకుంటున్నాడు. కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss