Hero Venkatesh Request To Public About Animals over coronavirus
కరోనా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతుండటంతో.. ప్రతీ ఒక్కరు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు కూడా వణికిపోతున్నారు. అయితే జంతువుల నుంచి కరోనా వ్యాపిస్తుందని రూమర్స్ వస్తున్నాయి. దీనికి తోడు.. అమెరికాలో పులికి వైరస్ సోకిందన్న వార్త కలకలం రేపింది. దీంతో అన్ని జూలలో అప్రమత్తం అయ్యారు.
అయితే కొందరు తమ ఇళ్లలో పెంచుకుంటున్న పెంపుడు జంతువులను కూడా కరోనా భయంతో బయటకు తరిమేస్తున్నారు. ఇది చాలా దారుణమని సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ అన్నారు. ఈ కష్ట సమయంలో మన అవసరం వాటికి ఎంతో ఉందన్నారు. ‘ఇది కేవలం మానవాళికే కష్టకాలం కాదు.. భూమి మీద ప్రాణకోటికి కష్టకాలమే’అని ట్వీట్ చేశారు.
” వైరస్ సోకుతుందనే భయంతో కొందరు తమ పెంపుడు జంతువులను తరిమేస్తారని తెలిసి.. చాలా బాధకలిగింది. అవన్నీ అవాస్తవాలు అని ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ఎవరు నమ్మడం లేదు. మనలోని మానవత్వన్ని మళ్లి నిద్ర లేపాల్సిన సమయం ఇది. మన మిత్రులతో సమానమైన జంతువులపై ప్రేమను కురిపించండి. ఈ లాక్డౌన్ సమయంలో వాటితో కొంత సమయాన్ని కేటాయించండి. ఈ సంక్షోభం ముగిసే సమయానికి మన జంతు మిత్రులతో కలిసి, బలంగా ఉండాలి’’అని వెంకీ ట్వీట్ చేసాడు.