Sunday, June 20, 2021

Latest Posts

పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత

Heroine Pranitha Subhash Marriage

హీరోయిన్ ప్రణిత సుభాష్ వివాహం ఘనంగా జరిగింది. నితిన్ రాజు అనే వ్యాపారవేత్తతో కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగించి ఇప్పుడు అతనిని వివాహం చేసుకుంది. బెంగుళూరులో చాలా తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలో తన వివాహం జరిగింది. కరోనా కారణంగా బెంగుళూరులోని ప్రణిత వివాహం తన సొంత ఇంటి వద్దనే జరిగిందని తెలుస్తోంది. వివాహానికి హాజరైన ఒక స్నేహితుడు వివాహ వేడుకల చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది.

Heroine Pranitha Subhash Marriage With Business Man, 99Telugu, Heroine Pranitha Subhash Marriage,Pranitha Subhash Marriage, Pranitha Marriage, Pranitha Marriage With Business Man

వ్యాపారవేత్త నితిన్ కూడా బెంగళూరుకు చెందినవాడని సమాచారం. తన వివాహం పై ప్రణీత స్పందించింది. ఇది లవ్ కమ్ ఆర్గనైజ్డ్ మ్యారేజ్ అని నేను నితిన్‌ను చాలా కాలం నుండి ప్రేముంచుకుంటున్నాము అని తెలిపింది. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించామని చెప్పారు. అత్తారింటికి దారేది, రభస వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ ప్రణీత.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss