Heroine sai pallavi career become the MBBS cardiologist
ఢీ షో ద్వారా బుల్లి తెరకు పరిచయమైన సాయి పల్లవి.. వరుణ్ తేజ్ – శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. అయితే ఈ చిత్రంలో ఆమె నటన, డ్యాన్స్, చెప్పిన డైలాగ్ లకు మన తెలుగు ప్రేక్షకులు నిజంగానే ఫిదా అయిపోయారు. ఆ చిత్రంలో ఆమె పలికిన డైలాగ్ లు ఇప్పటికీ టిక్ టాక్ లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆ తరువాత ‘ఎం.సి.ఏ’ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ అందుకోగా… తరువాత చేసిన ‘పడి పడి లేచె మనసు’ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడినా… ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం రానా తో ‘విరాటపర్వం’ అలాగే నాగ చైతన్య తో ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది సాయి పల్లవి . లాక్ డౌన్ తరువాత ఈ రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని ఆసక్తి కరమైన విషయాలు చెప్పుకొచ్చింది. ‘సినిమాల మీదే పూర్తిగా ఆధారపడలేదని… ఎం.బి.బి.ఎస్ పూర్తి చేసి కార్డియాలజిస్ట్ అవ్వాలని భావిస్తున్నట్టు తెలిపిన ఈ బ్యూటీ… ఎటువంటి వాణిజ్య ప్రకటనలు చెయ్యను అని కూడా తేల్చి చెప్పేసింది.
ఇకపోతే రెమ్యూనరేషన్ ఇస్తున్నారు కదా అని… పాత్రకు ప్రాధాన్యత లేని సినిమాలు చెయ్యనని.. కురచ బట్టలు కూడా వేసుకోను అని చెప్పింది. ‘ఫిదా’ సినిమాలో ఓ సీన్ కు కురచగా ఉండే డ్రెస్ వేసుకున్నాను. ఆ సీన్ కు అది అవసరం. అలా అని ప్రతీ సినిమాలో అలా వేసుకోవాలి అని ఇబ్బంది పెడితే… ఆ సినిమా వదిలేస్తా’ అంటూ చెప్పుకొచ్చింది.