Heroines Manya in higher position in leading companies
సినిమాలు విడిచి ఉన్నత కంపెనీలలో అత్తుత్తమ స్థాయిలో హీరోయిన్స్ ఉన్నారు. కాగా సాధారణంగా హీరోయిన్స్ వారి సినీ జీవితం చాల తక్కువగా ఉంటుంది, ఛాన్సులు వస్తే ఒక 10 ఏళ్ళు సాఫీగా గడచిపోతుంది, అంతకుమించి ఉన్న హీరోయిన్ యేతర రోల్స్ చెయ్యడం తప్ప వాళ్లకు వేరే అవకాశం ఉండదు. వీరు కూడా మరెటువంటి రోల్స్ లోను కనిపించాలని అనుకోరు. చాలా మంది హీరోయిన్స్ తమ సినీ కెరీర్ తర్వాత వివాహ జీవితానికి ముఖ్య కాలం ఇస్తారు. కొంత మంది హీరోయిన్స్ వారి భర్తల బిజినెస్ ను చేసుకుంటుంటారు. ఇలా కాకుండా వారి అకాడమిక్ క్యాపబిలిటీతో లీడింగ్ కంపెనీలలో ఉన్నత స్థాయిలో ఉన్న హీరోయిన్స్ కూడా ఉన్నారు.
వారిలో మాన్య. నాగార్జున హరికృష చెల్లిగా సీతారామరాజు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది మాన్య. మాయదారి మైసమ్మ పాటతో మంచి ఫాన్స్ ని కూడా సంపాదించుకుంది. కాగా తర్వాత ప్రపంచ ప్రఖ్యాతి గాంచినా బ్యాంకింగ్ సంస్థ అయినా jp morgan chase కంపెనీ లో కీలక బాధ్యతల్లో ఉంది. నటన నుండి నేరుగా ఫైనాన్స్ రంగం లో స్థిరపడిందిమాన్య. ప్రస్తుతం మాన్య ఎందరికో ఆదర్శం. నటి మయూరి కాంగో, మహేష్ బాబు వంశి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన మయూరి బాలీవుడ్లో చాల చిత్రాల్లో నటించింది. పూర్తిగా సినిమాలను వదిలేసిన మయూరి కాంగో న్యూయార్క్‌లోని జిక్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ ఫైనాన్స్ విద్యను అభ్యసించారు. ప్రస్తుతం గుర్గావ్లో నివసిస్తున్న మయూరి కాంగో గూగుల్ ఇండియాలో టాప్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతలను చేపట్టింది.
హీరోయిన్ అపర్ణ. వెంకటేష్ నటించిన సుందరకాండ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఈమె..అమెరికాలో డబల్ మాస్టర్స్ చేసి అక్కడ ఒక టాప్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో సైకాలజీ లో ఏడేళ్లుగా ఎంతో మందిని తీర్చుదిద్దుతున్నారు. జయం చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన శ్వేతా.. హీరోయిన్ గా అవకాశాలు వద్దనుకుని మొదట క్యాంపస్ ప్లేసెమెంట్స్ ద్వారా విప్రో లో జాబ్ చేసి ఆ తర్వాత వరల్డ్ నెంబర్ వన్ సంస్థ అయినా యూనియన్ బెస్ట్ ట్రేడ్ కంపెనీ లో ఉద్యోగం చేసింది.పెళ్లయ్యాక ఫామిలీ బిజినెస్ ని తన భుజాలపై మోస్తుంది శ్వేతా