heros that did not accept #be the real man challenge :
టాలీవుడ్ లో చాలా రోజుల నుంచి ఛాలెంజ్ ల ట్రెండ్ నడుస్తుంది. #బి ద రియల్ మాన్ ఛాలెంజ్ దీనిలో అత్యంత ట్రెండింగ్ లో ఉన్న ఛాలెంజ్ అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా మొదలు పెట్టిన ఈ ఛాలెంజ్ టాలీవుడ్ బిగ్ సెలెబ్రెటీస్ చుట్టూ తిరిగింది. వీరిలో మెగాస్టార్ట్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టిఆర్, విక్టరి వెంకటేష్, విజయ్ దేవరకొండ, డైరెక్టర్లలో రాజమౌళి, క్రిష్, సుకుమార్, కొరటాల శివ పాలు పంచుకున్నారు.
కాకపోతే సూపర్ స్టార్ మహేశ్ బాబు కు విక్టరి వెంకటేష్ ఈ ఛాలెంజ్ ను విసిరారు. కాకపోతే ఈ లాక్ డౌన్ సమయంలో పిల్లలతో ఆడుకుంటూ, నెట్ ఫ్లిక్స్ చూస్తూ గడుపుతున్న మహేష్ బాబు ఈ ఛాలెంజ్ ను పక్కన పెట్టాడు. ఇక అటు పొలిటికల్ కెరీర్ లోనూ ఇటు మూవీ కెరీర్ లోనూ బిజీ గా ఉన్న పవన్ కల్యాణ్ ట్విటర్ లోనూ, సామాజిక సహాయాలలోనూ స్పందిస్తూ ఉన్నారు. బాహుబలి ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ తన ఛాలెంజ్ ప్రభాస్ కు ఇవ్వగా అస్సలు బయటకు కూడా రాని ప్రభాస్ ఎక్కడా స్పందించలేదు.