Wednesday, November 25, 2020

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

తెలంగాణలో హై ఎలెర్ట్ – ఒక్కరోజే 8 కరోనా కేసులు

High Alert in Telangana – 8 corona cases per day:

కారోనా ఎఫెక్ట్ తో తెలంగాణ రాష్ట్రం కలవరం చెందుతోంది. బుధవారం ఒక్క రోజే ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇండోనేషియానుంచి వచ్చిన ఓ బృందంలోని ఏడుగురితోపాటు స్కాట్లాండ్‌ నుంచి వచ్చిన 21 సంవత్సరాల యువకుడికి కూడా కరోనా ఉందని తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 13కి చేరింది. ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇండోనేషియా నుంచి 10మంది సభ్యులతో కూడిన ఓ బృందం ఇటీవల కరీంనగర్‌కు వచ్చింది. మార్చి 14న ఢిల్లీ నుంచి ఏపీ సంపర్క క్రాంతి రైలులో రామగుండం చేరుకుంది. ఈ బృందంలోని 58 సంవత్సరాల వ్యక్తికి కరోనా ఉన్నట్లు మంగళవారం బయటపడింది. దీంతో ఆ బృందంలోని మిగిలినవారి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు.

ఇప్పుడు దీంట్లో ఏడుగురికి పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. దీంతో కరీంనగర్‌ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌, మంత్రి గంగుల కమలాకర్‌ రంగంలోకి దిగారు. ఆ బృందం ఎక్కడెక్కడ తిరిగింది, ఎవరెవర్ని కలిసింది అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఆ బృందం బస చేసిన మసీదును పూర్తి స్థాయిలో శుభ్రం చేయించారు. ఆ వీధి మొత్తాన్ని దిగ్బంధం చేసి పరిశుభ్రత చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న బజార్‌ను పూర్తిగా మూసివేశారు. దుకాణాలు, హోటళ్లు, టేలాలు మూసివేయించి అటువైపు ఎవరిని అనుమతించడం లేదు.

ఇండోనేషియా బృందం కలెక్టరేట్‌ ప్రాంతంలో 48 గంటలు సంచరించడంతో కలెక్టరేట్‌కు మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు చేస్తామని కలెక్టర్‌ శశాంక, మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు. దీనికోసం 100 వైద్య బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కరీంనగర్‌లో నిత్యావసర దుకాణాలు మినహా మిగిలిన షాపులు, వ్యాపార సంస్థలు మూసివేస్తేనే మంచిదని కలెక్టరు, మంత్రి గంగుల సూచించారు. ఇంటి వద్దే ఉండడం సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. కరీంనగర్‌ పట్టణంలో తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఎవరూ ఇళ్లనుంచి బయటకు రావొద్దని సూచించారు. ఇండోనేసియా బృందంప్రయాణించిన రైలు బోగీలో ఉన్న ప్రయాణికుల వివరాలను సేకరిస్తున్నారు. కాగా స్కాట్లాండ్‌ నుంచి వచ్చిన 21 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

Don't Miss

రేపు దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌ అనగానే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్‌ మ్యూజియం. వీటితో పాటు సైబర్‌ టవర్స్, హైటెక్‌సిటీ, ఐకియా వంటివి గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు మరో అద్బుతమైన కట్టడం హైదరాబాద్న గరంలో పూర్తయింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న...

అగ్రిగోల్డ్‌ బాధితులకు గుడ్ న్యూస్

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం మొదట విడతలో భాగంగా అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ.10...

మిల్కీ బ్యూటీ ఇంట్లోనే షూటింగ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే  షూటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

ప్రజా సంకల్ప యాత్రకి మూడేళ్లు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకి శ్రీకారం చుట్టి మూడేళ్లు అవుతుండటం తో  పార్టీకి విజయం కోసం కీలక పాత్ర పోషించిన పాదయాత్రకు మూడేళ్లు...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

ఢీకొన్న సైనిక హెలికాప్టర్లు

మంగళవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు వైమానిక దళ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటన హెల్మండ్ ప్రావిన్సులోని నవా జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో 15 మంది మరణించారు....

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...