Tuesday, January 25, 2022

Latest Posts

సినిమా టికెట్ల ధర పై హైకోర్టు కీలక నిర్ణయం

High court hearing on movie ticket prices issue

ఈ మహమ్మారి కరోనా వైరస్ కారణంగా యావత్తు  ప్రపంచం మొత్తం అతలాకుతలం అయింది.  అందరిని ఎంతో భయాందోళనకు గురి చేసింది. ఈ నేపథ్యంలో పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం మొదటి వేవ్‌లో పటిష్టంగా లాక్‌డౌన్ విధించింది. దీని వల్ల భారత్‌లో కరోనా కేసులు చాలా వరకూ తగ్గుముఖం పట్టాయి. ఆ తర్వాత లాక్‌డౌన్ ఎత్తేయడం. దీంతో ప్రజలు భయాన్ని మరచి తమకు నచ్చినట్లుగా ఉండటంతో కరోనా సెకండ్ వేవ్ రావడానికి ప్రధాన కారణంగా భావించ వచ్చు. అయితే సెకండ్ వేవ్‌ను కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కూడా మరోసారి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది.

అయితే ఈసారి మాత్రం కేంద్రం లాక్‌డౌన్ ఆంక్షల విషయాన్ని పూర్తిస్థాయిలో రాష్ట్రాలకు వదిలేసింది.  అలా తెలంగాణలో కొన్ని రోజుల క్రితం అమలులోకి వచ్చిన లాక్‌డౌన్ గత నెల (జూన్) 20వ తేదీతో ఎత్తి వేయడం తో దీంతో మళ్లీ అన్ని వ్యాపారాలు యధావిధిగా ప్రారంభం అయ్యాయి. కానీ సినిమా థియేటర్లు మాత్రం తెరవడానికి సందిగ్ధంలో పడిపోయాయి. కరోనా ఇంకా అలాగే ఉన్న పరిస్థితుల్లో థియేటర్లు తెరిచేందుకు యజమానులు ముందకు రాలేదు.  కానీ, ఇలా నష్టాల్లో ఎంతకాలం ఉంటామంటూ తెలంగాణ ఫిలిమ్ ఛాంబర్ ఈ నెల 23 నుంచి థియేటర్లను ప్రారంభించింది.

కానీ థియేటర్లు మళ్లీ ప్రారంభమై సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు వచ్చే క్రమంలో టికెట్ల ధరలు ఏ రేంజ్‌లో ఉంటాయని అంతా భయపడుతున్నారు. దీనిపై ఇప్పటికే సినీ ప్రేక్షక వినియోగదారుల సంఘం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కాకుండా చట్టప్రకారం టికెట్ల ధరలను ఖరారు చేయడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది జీఎల్ నర్సింహారావు వాదించారు. తాజాగా దీనిపై ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లి, జస్టిస్ బీ.విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. టికెట్ ధరల నిర్ణయం కోసం ఏర్పాటు చేసిన కమిటీ సూచనల మేరకు నాలుగు వారాల్లో పూర్తి నివేదికను సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss